నవతెలంగాణ – రాయపర్తి
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీకి రాయపర్తి జర్నలిస్టులు ఎన్నికైనట్లు వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్ టివి న్యూస్ రిపోర్టర్ ఎండి నాజర్ జిల్లా కమిటీలో కోశాధికారిగా, ఎన్ టివి రిపోర్టర్ మునుగోటి అనిల్ కుమార్ ఈసీ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రాంచందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో జిల్లా కమిటీకి ఎన్నుకున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని విన్నవించారు. తోటి జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు.
జిల్లా కమిటీకి ఎన్నికైన రాయపర్తి జర్నలిస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



