- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: RBI వడ్డీరేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ.. అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని ఆర్‌బీఐ గవర్నర్ ఈసందర్భంగా పేర్కొన్నారు. అందువల్ల రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక, స్థిర విధాన వైఖరిని కమిటీ మరింత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -