Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక ప్రకటన..సెప్టెంబర్ 30 డెడ్‌లైన్

ఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక ప్రకటన..సెప్టెంబర్ 30 డెడ్‌లైన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 నాటికి తమ రీ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించింది. జూలై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. నిబంధనల ప్రకారం, యాంటీ-మనీ లాండరింగ్ ప్రోటోకాల్స్‌లో భాగంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కస్టమర్ వివరాలను ధృవీకరించుకోవడం తప్పనిసరి అని ఆయన వివరించారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో జన్ ధన్ ఖాతాలకు కేవైసీ అప్‌డేషన్ గడువు ముగియనుందని, గడువులోగా రీ-కేవైసీ పూర్తి చేయని ఖాతాలపై లావాదేవీల పరిమితులు విధించడం లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సుమారు లక్ష గ్రామ పంచాయతీలలో బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్యాంపులలో రీ-కేవైసీ సేవలతో పాటు, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం, సూక్ష్మ బీమా, పెన్షన్ పథకాలలో చేరడం, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి సేవలను కూడా అందిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -