బీసీసీఐ, కేఎస్‌సీఏతో కలిసి
క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి
బెంగళూరు : ఐపీఎల్2025 చాంపియన్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్‌సీబీ) గెలుపు సంబురాలు ఊహించని విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఆర్‌సీబీ యాజమాన్యం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, స్టేడియంలో మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ఆర్‌సీబీ ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా స్టేడియం అధికారులు, క్రీడా సంఘం, లీగ్ భాగస్వాములతో కలిసి పని మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ పద్దతులు తీసుకురానుంది. స్టేడియంలో అభిమానుల రద్దీపై స్వీయ అధ్యయనం చేయనుంది. అభిమానుల సంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ దృష్టిలో ఉన్నాయి.