Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారులను అభినందించిన ఆర్సీఓ హరిసింగ్  

ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారులను అభినందించిన ఆర్సీఓ హరిసింగ్  

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
స్థానిక గిరిజన గురుకుల కాలశాలలోని క్రీడాకారులు ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట స్థాయి లలో హ్యాండ్బాల్,వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ లలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించి మెదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్సీఓ హరి సింగ్ అభినందనలు తెలిపారు. 

శుక్రవారం స్థానిక మండల కేంద్రం లో గల గిరిజన బాలుర కళాశాలను ఆయన సందర్శించి జాతీయ అథ్లెటిక్స్ లలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించి మెదటి స్థానంలో నిల్చిన విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. రానున్న రోజులలో ఇంకా పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ములుగు డీసీఓ శ్రీనివాస్ రెడ్డి , కలశాల ప్రిన్సిపాల్ మాధవి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం , గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి ,వైస్ ప్రిన్సిపాల్ కల్పనా, మహేందర్ పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేష్ డిప్యూటీ వాడెన్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -