స్వప్న సినిమాస్ తాజా చిత్రం ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. అనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రోషన్ హీరోగా నటిస్తుండగా, మలయాళ కథానాయిక అనశ్వర రాజన్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మేకర్స్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిరంజీవి లంకేశ్వరుడు సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన తర్వాత ఆయన విరామం తీసుకున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే స్వప్న సినిమాస్ ఆయన్ని మళ్ళీ స్క్రీన్ పైకి చూపించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ చిత్ర కథ, అందులోని ఆయన పాత్రకు ఉన్న డెప్త్ కల్యాణ్ చక్రవర్తిని ఇంప్రెస్ చేశాయి. కళ్యాణ్ చక్రవర్తి రియలిస్టిక్, కథకు కీలకమైన రాజి రెడ్డి పాత్రలో కనిపిస్తారు. అతని ప్రజెన్స్ ఈ సినిమా ఎమోషన్స్, డ్రామాకి మరింత డెప్త్‌ని తీసుకురానుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. రోషన్, అనశ్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ : ఆర్ మదీ, సంగీతం: మిక్కీ జె మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.
35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



