నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతలో గత జూన్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన ప్రజల దరఖాస్తులపై అధికారుల ఆదేశాల మేరకు గురువారం రీ–వెరిఫికేషన్ కార్యక్రమాన్ని గురువారం రాయిచెడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. మండల తహసీల్దార్ అద్దంకి సునీత గ్రామానికి చేరుకుని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ బలరాం నాయక్, జిపిఓ సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కళావతి, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ అద్దంకి సునీత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడంపై, పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆమె సూచించారు.
రాయిచెడులో రెవెన్యూ దరఖాస్తుల రీ–వెరిఫికేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



