డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే లో ప్రిన్సిపాల్ దొడ్డి భద్రయ్య
నవతెలంగాణ – మణుగూరు
ఫేస్ బుక్ కన్నా పుస్తక పఠనం మిన్న అని మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దొడ్డి భద్రయ్య అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే లో పాల్గొని మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు సెల్ ఫోన్ వలన ఇంస్టాగ్రామ్ , ఫేస్ బుక్, యూట్యూబ్ వివిధ మార్గాల ద్వారా విద్యార్థులు చెడు మార్గాన పడుతున్నారని అన్నారు. అదే సెల్ ఫోన్ ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు కూడా ఉన్నారని తెలిపారు. కళాశాలలో సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు ఫోన్ కు దూరంగా ఉండాలని లైబ్రరీలో ఎక్కువ గడపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కర్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ మావేశానికి అతిధులుగా మణుగూరు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్య ప్రకాష్ అశ్వాపురం జూనియర్ కళాశాల శేషు బాబు మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాలియ స్టాఫ్ సెక్రటరీ రమేష్ బాబు కామర్స్ లెక్చరర్ వీణ రామ తిరుపతి పోకిరి భాస్కరరావు సాంబమూర్తి అశోక్ శివ కుమార్ నాగిరెడ్డి శిరీష బూర్గుల సతీష్ సోడే నవీన్ శ్రీకళ స్రవంతి స్నేహ తదితరులు పాల్గొన్నారు.
ఫేస్ బుక్ కన్నా.. పుస్తక పఠనం మిన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES