Monday, December 1, 2025
E-PAPER
Homeజాతీయంనిజమైన కుక్కలు పార్లమెంటులో కూర్చున్నాయి: ఎంపి రేణుకా చౌదరి

నిజమైన కుక్కలు పార్లమెంటులో కూర్చున్నాయి: ఎంపి రేణుకా చౌదరి

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేణుకా చౌదరి ఓ పెంపుడు కుక్కను పార్లమెంటుకు తెచ్చారు. దీనిపై ఎన్‌డిఎకు చెందిన ఎంపీలు రేణుకా చౌదరిని తీవ్రంగా విమర్శించారు. ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కుల్ని ఆమె దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ విషయంపై రేణుకా చౌదరి స్పందించారు. నిజమైన కుక్కలు పార్లమెంటు కూర్చున్నాయి. అవి రోజూ ప్రజల్ని కరుస్తున్నాయని కౌంటర్‌ ఇచ్చారు. పెంపుడు కుక్క కారులోనే ఉంది. రేణుకాచౌదరి కారు దిగగానే ఆ పెంపుడు కుక్కను భద్రతా సిబ్బంది ఇంటికి పంపారు. ఈ విషయంపై ప్రతిపక్ష ఎంపీలు చేసిన విమర్శలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కుక్కను తీసుకురాకూడదని ఏమైనా చట్టం ఉందా? నేను కారులో వెళుతున్నప్పుడు ఒక స్కూటర్‌ కారును ఢికొీట్టింది. ఈ చిన్న కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోంది. అది చక్రానికి గుద్దుకుంటుందని నేను అనుకున్నాను. అందుకే దాన్ని తీసుకుని కారులో వేసి.. పార్లమెంటును తెచ్చాను. ఆ తర్వాత దాన్ని వెనక్కి పంపించాను. కారు వెళ్లిపోయింది.

కుక్క కూడా వెళ్లిపోయింది. ఈ చర్చ వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ సందర్భంగా ‘నిజమైన కుక్కలు పార్లమెంటులో కూర్చున్నాయి’ అని ఎన్‌డిఎ ఎంపీలనుద్దేశంచి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అసలు కాటువేసే వాళ్లు పార్లమెంటులో కూర్చుంటారు. వాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారు. మనం ఒక మూగ జంతువును జాగ్రత్తగా చూసుకుంటాము. ఇది పెద్ద సమస్యగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా? నేను కుక్కను ఇంటికి పంపించి ఇంట్లో ఉంచుకోమని చెప్పాను. పార్లమెంటులో కూర్చుకుని ప్రతిరోజూ మనల్ని కరిచేవారి గురించి మనం మాట్లాడము అని ఆమె అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -