నవతెలంగాణ-కాప్రా
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ మీరుపేట్ హౌసింగ్ బోర్డు పరిధిలోని మంగాపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం కుషాయిగూడకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిపై నడిరోడ్డు మీద అతని సహచరులే కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కత్తులతో అతిదారుణంగా హత్య చేసిన నిందితులు అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి క్లూస్‌ను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES