వాషింగ్టన్ : కొన్ని రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వాషింగ్టన్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో కొన్ని వంతెనలు, రెండు ఇండ్లు పునాదులతో సహా కొట్టుకునిపోయాయి. అనేక కుటుంబాలు ఇళ్లపై కప్పులపై చిక్కుకునిపోయాయి. ఈ వరదలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరదల కారణంగా వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. కనీసం 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. అనేక వంతెనలు, ప్రధాన రోడ్లు మునిగిపోయాయి. వీటిలో కొన్ని కొట్టుకునిపోయాయి.
సియాటిల్‌కు తూర్పున ఉన్న రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కెనడా సరిహద్దున ఉన్న నగరాలు సుమాస్, నూక్‌సాక్, ఎవర్సన్‌ల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. సుమాస్ మేయర్ బ్రూస్ బాష్ మాట్లాడుతూ ఇలాంటి వరదలు రావడం నాలుగేళ్ల తరువాత ఇదే మొదటిసారని చెప్పారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నదులు కూడా ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆదివారం వరకూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వరద ఉధృతి మరింతగా పెరుగుతుందనే ఆందోళన అధికారులు, ప్రజల్లో వ్యక్తమవుతోంది.
వాషింగ్టన్‌లో రికార్డు స్థాయి వరదలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



