10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వచ్చే మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు బుధ, గురువారాలకు సంబంధించి హన్మకొండ, జనగాం, మహబూబాబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలుండటంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 200కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వాన పడింది. ములుగు జిల్లా మంగపేటలో 7.9 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది.
8 జిల్లాలకు రెడ్ అలర్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES