నవతెలంగాణ-హైదారాబాద్: భారత్ వాతావరణశాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.మహారాష్ట్రలోని రత్నగిరి, రాయ్‌గడ్, ముంబై నగరం, ముంబై సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాల్లో రానున్న మూడు, నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డానున్నాయని ఐఎండీ పేర్కొంది. ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇక అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను పోలీస్ శాఖ కోరింది. ఇక ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ నెంబర్లు 100 / 112 / 103కు చేసి సహాయ పొందాలని కోరారు.
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం వల్ల నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి మట్టి, రాళ్లు గుడిసెపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక క్షతగాత్రులను రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.