పుల్వామాలోని నివాసాన్ని భద్రతా బలగాలు ధ్వంసం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించి..కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని శుక్రవారం భద్రతాదళాలు కూల్చివేశాయి. కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న ఆయన ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. పేలుడు పదార్ధాలను దాచేందుకు ఉమర్ నబీ ఆ ఇంటిని వాడుకున్నట్టు గుర్తించారు. హుందరు ఐ20 కారుతో పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ.. డీఎన్‌ఏ శాంపిళ్లను కన్ఫర్మ్ చేశారు.
అదే విధంగా 50 కెమెరాల ఫుటేజ్‌ను ఉపయోగించి ఎర్రకోట పేలుడు నిందితుడి చివరి గంటలను పోలీసులు(రీకన్‌స్ట్రక్షన్) చేశారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు రూ.26 లక్షలకు పైగా నగదును సేకరించారని, బ్లాస్ ప్రణాళిక అమలుకు ఆ నిధులను నబీకి అప్పగించారని తెలిసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మతుల సంఖ్య 13కు చేరుకోగా, 20మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఉగ్రకార్యకలాపాలకు మద్దతునిచ్చే వారికి ఇలాంటి శిక్షే ఉంటుందన్న ఉద్దేశాన్ని తెలిపేందుకు భద్రతాదళాలు ఉమర్ నబీ ఇంటిని పేల్చివేశాయి. భారత భూభాగంపై ఉగ్ర కార్యకలాపాలకు చోటు లేదన్న సంకేతాన్ని వినిపించాయి.
ఎర్రకోట సూసైడ్ బాంబర్ ఇల్లు కూల్చివేత
- Advertisement -
- Advertisement -



