నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు సర్వదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
నిన్న (గురువారం) స్వామివారిని 63,843 మంది భక్తులు దర్శించుకోగా.. 21,344 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. గురువారం స్వామివారికి భక్తులు ధన, వస్తు రూపాల్లో హుండీలో సమర్పించిన కానుకల విలువ రూ.3.44 కోట్లు ఉంటుందని టీటీడీ తెలిపింది. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను ఆచితూచి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES