నవతెలంగాణ-హైదరాబాద్: యూట్యూబ్ రీల్స్ మోజులో పడి పలువురు యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.
మృతుని మొబైల్ ఫోన్‌లో రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్‌లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.