Tuesday, August 5, 2025
E-PAPER
Homeజాతీయంజగన్నాథుడి కోసం ట్రంప్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించ‌: ప్ర‌ధాని మోడీ

జగన్నాథుడి కోసం ట్రంప్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించ‌: ప్ర‌ధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పూరీ జగన్నాథుడి ద‌ర్శ‌నం కోసం ట్రంప్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించాన‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఒడిశాలో జగన్నాథుడి దర్శనం ఉందని.. మీ లంచ్ ఆహ్వానం కంటే తనకు పూరీ జగన్నాథు(Puri Jagannatha Swamy)డి సేవనే ముఖ్యమని చెప్పానని అన్నారు. జగన్నాథ దేవాలయంలో నాలుగు ద్వారాలు తెరవడం, రత్న భండార్ పునఃప్రారంభం వంటి పనులతోపాటు పొగిడి, రూ. 18,600 కోట్లతో 105 అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ ఈ సభ నుంచే ప్రారంభించి.. “ఒడిశా విజన్ డాక్యుమెంట్”ను విడుదల చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరవాలన్న ప్రజల డిమాండ్‌ను త‌మ‌ ప్రభుత్వం నెరవేర్చిందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒడిశా అవినీతి కేంద్రంగా నిలిచిందన్న ప్రధాని.. మౌలిక సదుపాయాల కల్పనలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్నారు. చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని, క్రమంగా వాటిని అభివృద్ధి చేసేందుకు భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -