Tuesday, July 29, 2025
E-PAPER
Homeసినిమారిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

2022లో విడుదలైన ‘కాంతార’ భారతీయ సినిమా పరంగా సరికొత్త దిశగా అడుగు వేసింది. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టించిన ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిషబ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, షూటింగ్‌ పూర్తయినట్లు అనౌన్స్‌ చేశారు. ”కాంతారా’ లక్షలాది మందిని కదిలించిన మాస్టర్‌ పీస్‌కి ప్రీక్వెల్‌. రిషబ్‌ శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డివైన్‌ సినిమాటిక్‌ విజువల్‌ వండర్‌ మోస్ట్‌ అవైటెడ్‌ ప్రీక్వెల్‌…కాంతార చాప్టర్‌ 1 అక్టోబర్‌ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌’ అని పోస్ట్‌ చేశారు.
ఈ సినిమా కోసం ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. 500 మందికి పైగా ఫైటర్లు, 3000 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 25 ఎకరాల్లో ఓ టౌన్‌ సెట్‌ వేసి, 50 రోజుల పాటు షూటింగ్‌ చేశారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -