అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కాహాల్’. ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. దర్శకుడు మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
‘ఇదొక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ చెప్పకనే చెప్పింది. కథానాయకుడి జీవితాన్ని మద్యం ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు, తాగిన తరువాత అతని ప్రవర్తన, దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారంతో ఈ సినిమా ఉండనుంది అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా అల్లరి నరేష్ ‘ఆల్కాహాల్’ రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తారు. అల్లరి నరేష్, సత్య కలయికలో పండే వినూత్న హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీరి కలయిక ఈ మిస్టరీ, థ్రిల్లింగ్ డ్రామాకు వినోద పొరలను జోడిస్తుంది. ఈ టీజర్‌లో సాంకేతిక నిపుణుల ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం., సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. నూతన సంవత్సర కానుకగా థియేటర్లలో అడుగుపెట్టి, ప్రేక్షకులకు నాలుగు రోజుల వారాంతపు విందును అందించనుంది అని మేకర్స్ అన్నారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: మెహర్ తేజ్, సంగీతం: గిబ్రాన్, ఛాయాగ్రహణం: జిజు సన్నీ, కూర్పు: నిరంజన్ దేవరమానే, కళా దర్శకుడు: విశాల్ అబానీ, సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి.
న్యూ ఇయర్ గిఫ్ట్‌గా రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES