Saturday, December 6, 2025
E-PAPER
Homeసినిమాసంక్రాంతి కానుకగా రిలీజ్‌

సంక్రాంతి కానుకగా రిలీజ్‌

- Advertisement -

హీరో శర్వా నటిస్తున్న ఫీల్‌-గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘నారి నారి నడుమ మురారి’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ‘సంక్రాంతి.. తెలుగు సినిమా రిలీజెస్‌కి బిగ్గెస్ట్‌ సీజన్‌. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైమెంట్‌ కావడంతో సంక్రాంతి విడుదలకు పర్‌ఫెక్ట్‌ అని భావిస్తున్నాం. శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్‌ ట్రాక్‌ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.

‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్‌ రాజా’ వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని నమ్మకంగా ఉంది’ అని మేకర్స్‌ తెలిపారు. ఈచిత్రానికి స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు, నిర్మాతలు: అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర, కథ: భాను బోగవరపు, డైలాగ్స్‌: నందు సవిరిగాన, డీఓపీ : జ్ఞాన శేఖర్‌, యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్ర శేఖర్‌, సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -