Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా, అమెరికాలో మొట్టమొదటి కొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్ట్ వద్ద నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 25 లక్షల కోట్లు). ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీల్ అని ట్రంప్ అభివర్ణించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. “భారతదేశంలోని మా భాగస్వాములకు, అక్కడి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్‌కు ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ‘అమెరికా ఫస్ట్ రిఫైనింగ్’ అనే సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో (ఇరాన్ యుద్ధం నేపథ్యంలో) చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న సమయంలో, ఈ కొత్త రిఫైనరీ అమెరికా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, వేలాది మందికి కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -