Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంజమ్మూలో వెల్లివిరిసిన మత సామరస్యం!

జమ్మూలో వెల్లివిరిసిన మత సామరస్యం!

- Advertisement -

– అవాస్తవ ఆరోపణతో ముస్లిం పాత్రికేయుడి ఇంటిని కూల్చివేసిన అధికారులు
– అండగా నిలిచి స్థలాన్ని ఇచ్చిన హిందూ సోదరుడు
జమ్మూ :
మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠాతో ఓ పోలీసు అధికారికి ఉన్న సంబంధాల గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నించిన పాత్రికేయుడు అర్ఫజ్‌ అహ్మద్‌ డయాంగ్‌ నివాస గృహాన్ని జమ్మూ కాశ్మీర్‌ అధికారులు నాలుగు రోజుల క్రితం కూల్చివేసిన ఉదంతం గుర్తుందా? నిలువనీడ కోల్పోయిన ఆ ముస్లిం పాత్రికేయు నికి జమ్మూకు చెందిన సామాజిక కార్యకర్త, హిందువు అయిన కులదీప్‌శర్మ అండగా నిలిచారు. డయాంగ్‌ తిరిగి ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని ఉచి తంగా ఇచ్చారు. బీజేపీకి గట్టిపట్టున్న జమ్మూలో, మత పర మైన ఉద్రిక్తతలకు నిలయమైన ఆ ప్రాంతంలో హిందూ – ముస్లిం స్నేహబంధాన్ని ప్రతిబింబించేలా ఆ స్థలానికి సం బంధించిన పత్రాలను డయాంగ్‌కు కులదీప్‌ అందజేశారు.
‘నిధుల కోసం దాతలను అడుక్కోవాల్సి వచ్చినా సరే మీ కోసం ఇంటిని కట్టిస్తాను. ముస్లింలకు హిందువులను వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్ర ఎన్నటికీ విజయం సాధిం చదు. మన మధ్య సోదరభావం చిరకాలం కొనసాగు తుంది. మీరు మంచి మనిషి. మీ పిల్లలకు ఉజ్వల భవి ష్యత్‌ చేకూరాలి’ అంటూ కులదీప్‌ కన్నీటిపర్యంత మయ్యారు. ప్రభుత్వ భూమిలో డయాంగ్‌ ఇంటిని నిర్మించి నందునే దాన్ని కూల్చివేశామంటూ జమ్మూకాశ్మీర్‌ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

చన్నీ ప్రాంతంలో నేలమట్టమైన ఇంటి శిథిలాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టార్పాలిన్‌ గుడారంలో డయాంగ్‌ కాలక్షేపం చేస్తున్నారు. దాన్ని పాత్రికేయులకు చూపుతూ ‘చూడండి. ఆయన పిల్లలు ఆరుబయట ఎలా కూర్చున్నారో? ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. దేశ పౌరులు అయినప్పటికీ నిరాశ్రయులయ్యారు’ అని కులదీప్‌ వాపో యారు. కులదీప్‌ శర్మ కుమార్తె తానియా శర్మ మాట్లా డుతూ తండ్రి తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో గర్వ కారణమని చెప్పారు. ‘నాకు చాలా విచారంగా ఉంది. రాత్రి కిరాత్రే ఇంటిని ఎలా కూల్చివేస్తారు? డయాంగ్‌ నాకు సోద రుడి వంటి వారు. నేను మాత్రమే కాదు… నా కుటుంబం, ఈ సమాజం మొత్తం ఆయనకు అండగా నిలుస్తుంది’ అని ఆమె తెలిపారు. హిందువులను ముస్లింలకు శత్రువులుగా చూపుతూ సాగిస్తున్న రాజకీయ ప్రచారాన్ని తిప్పికొట్టాలని, జమ్మూకాశ్మీర్‌ ప్రజలందరూ ఐక్యంగా నిలవాలని కోరారు.

తమ ఇంటిని నవంబర్‌ 27న కూల్చివేసిన తర్వాత వేలాదిమంది ప్రజలు అండగా నిలిచారని డయాంగ్‌ తండ్రి గులామ్‌ ఖాదిర్‌ అన్నారు. ‘నేనేమీ బాధపడడంలేదు. ప్రజ లు మా పక్షాన నిలిచారు. నా కుమారుడికి మద్దతు ఇచ్చా రు. ఇది నాకు ఎంతో విలువైనది. ఇంతకంటే నేను ఏం ఆశించగలను? ఇలాంటి ఉదంతాలు జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటికీ మతసామరస్యం నెలకొని ఉన్నదని నిరూపిస్తు న్నాయి. నేను నిజంగా సంతోషిస్తున్నాను. అవినీతిపరు లను, అక్రమంగా వ్యాపారాలు చేసేవారిని, భూములను కబ్జా చేసేవారిని ఎవరూ ప్రశ్నించరు. ఒకే అంతస్తుతో నిర్మించిన ఇంటిని జమ్మూ డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యం గా చేసుకుంది. నలభై ఏండ్ల క్రితం దీన్ని కట్టారు. మాకు వేరే ఇతర ఆస్తులేవీ లేవు. ఒకవేళ నా కుమారుడు నిజంగా అవినీతిపరుడైతే మాకోసం పెద్ద ఇంటినే కట్టి ఉండేవాడు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -