నవతెలంగాణ నవాబుపేట: మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ పక్కనే ఉన్న
పొలంలో పురాతన విగ్రహం (ముక్కిడిద్యావర) అనే విగ్రహాన్ని పట్టాదారు తన పొలంలో ఉందని వెంచర్ చేసే సమయంలో అనూకూలంగా లేదని ఎవరికి తెలియకుండానే తొలగించారని అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు భూమి యజమాని తీరుపై, హిందువుల మనోభావాల దెబ్బతిన్నాయని గ్రామస్తులు మండిపడ్డారు.
గతంలో పూర్వీకులు ఎంతో పవిత్రంగా భావించే అతి పురాతనమైన విగ్రహాలను ఆరాధన చేస్తూ గ్రామ ప్రజల క్షేమం, ఆరోగ్యం, బాగోగులను పురాతన కాలంలో ప్రతిష్టించిన దేవతలు ప్రజలును కాపాడే వారని నమ్మకంగా ఉండడం విశేషం భావించే వారు పెద్దలు మాట్లాడుతుండేవారని అన్నారు. వెంటనే ఆ పురాతన విగ్రహం తొలగింపును విరమించుకోవాలని విగ్రహం పునః ప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, హిందువుల ఆద్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.



