నవతెలంగాణ – గాంధారి
విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైరుఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని టీజీ ఎన్ పి డి సి యల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గాంధారి మండలాలలో పలు ప్రాంతాలలో కేబుల్ వైర్లను తొలగించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని టీజీ ఎన్ పి డి సి యల్ .సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గాంధారి మండలాలలో పలు ప్రాంతాలలో కేబుల్ వైర్లను తొలగించారు. హైదరాబాదులోని రామంతాపూర్లో కేబుల్ వైర్ల వల్ల ఐదుగురు మరణించారని దీంతో సీఎండీ జిల్లాలవారీగా కేబుల్ వైర్లను తొలగించాలని ఆదేశాలమేరకు కేబుల్ వైర్ల తొలగింపునకు శ్రీకారం చుట్టామని విద్యుత్ శాఖ డి ఈ విజయసారధి తెలిపారు.
రానున్న రోజులల్లో వినాయకచవితి ,దుర్గామాత ఉరేగింపుల సమయములో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ స్తంభాల పై ఉన్న కేబుల్ లను తీసివేశామని తెలిపారు .సక్రమ పద్దతిలో క్లిప్పింగ్ ,క్లమ్పింగ్ పద్దతిని అనుసరించి విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా చూడాలని తెలిపారు .కేబుల్ ఆపరేటర్లు ,ఇంటర్నెట్ ఆపరేటర్లు సహకరించాలని కోరారు. మరియు మండప నిర్వహకులకు ప్రజలకు ఈ క్రింది సూచనలు చేయడం జరిగిందివిగ్రహాలను మండపాలకు లేదా అమ్మకపు కేంద్రాలకు తరలించే సమయంలో రహదారులపై ఉన్న విద్యుత్ లైన్లకు దగ్గరగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 10 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలను తరలించే ముందు తప్పనిసరిగా విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా విద్యుత్ లైన్లను పైకి ఎత్తడం, తాకడం లేదా మార్గం క్లియర్ చేసేందుకు ప్రయత్నించడం చేయరాదు.
ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే సమీప విద్యుత్ అధికారులను సంప్రదించాలి. టోల్ ఫ్రీ నెంబర్1912ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏడిఈ మల్లేష్, ఏ ఈ సాయినాథ్ మరియు హరీష్ రావు, సబ్ ఇంజనీర్ భాస్కర్ లైన్మెన్ వాహిద్ , అసిస్టెంట్ లైన్మెన్సు ఆదిరెడ్డి , అనిల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.