నవతెలంగాణ ఎఫెక్ట్
స్పందించిన ఎంపీడీఓ ఉమాదేవి
రోడ్డుకు అడ్డుగా ఉన్నచెట్లు తొలగింపు
నవతెలంగాణ-పెద్దవూర
మండలం లోని నాయిన వానికుంట స్టేజీ నుంచీ నాయిన వానికుంట తండా వరకు మూడు కిలోమీటర్ల దూరం రహదారిలో పిచ్చిచెట్లు, ముళ్ల కంపలు,కంప చెట్లు దట్టంగా పెరిగిపోయి ప్రజలు రాకపోకలు సాగించేందుకు అడ్డంకిగా మారాయి. రోడ్డుపైకి చెట్ల కొమ్మలు వ్యాపించడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరచూ పలుసార్లు ప్రమాదాలు జరుగుతూ వాహన దారులు ఎదురెదురుగా వస్తూ ఢీ కొని చాలా మంది గాయాలు తగిలి ఆసుపత్రి లో చికిత్స చేయించు కున్న సంఘటనలు చాలా జరిగాయి.
చెట్ల కొమ్మలు రోడ్డుపైకి వ్యాపించడంతో వాహనదారులకు దారి కనిపించక ఇటు వాహనదారులు, అటు ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై గత ఐదు రోజుల క్రితం నవతెలంగాణ దిన పత్రిక లో ఈ నెల 24 న , రోడ్ల దుస్థితి చూడతరమా, అనే శీర్షికతో వార్త వెలువడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వార్తకు స్పందించిన మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి ఆదేశాల మేరకు కార్యదర్శి మోహన్ కూలీలను ఏర్పాటుచేసి రోడ్డుకు ఇరువైపులా రహదారిపై వ్యాపించి ఉన్న పిచ్చి మొక్కలను, ముండ్ల చెట్ల కొమ్మలను మల్టీ ఫర్ఫస్ వర్కర్లు చే కొట్టించి వేయించారు. దీంతో రహదారి ఎప్పటిలాగా విశాలంగా మారడంతో పాటు దారి కనబడకుండా అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడంతో వాహనదారులు, పాదాచారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.