అఖిల భారత ఐక్య రైతు సంఘం తొర్రూర్ డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతు పండించిన పంటలు ప్రతి క్వింటాలకు రూ.10,000 మొక్కజొన్నలకు రూ.3000 ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘo తొర్రూరు డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య అన్నారు. సంఘం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం నెల్లికుదురు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడ్డ రైతులను ప్రభుత్వం సరిగా పట్టించుకోని కారణంగా దళారీలు ఇస్తారాజ్యంగా పంట కొనుగోలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలచే కొనుగోలు జరిపిస్తే దళారీల బెడదా తగ్గుతుందని రైతుకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చూపుతున్న సవితి తల్లి ప్రేమను విడనాడాలని లేదంటే రైతాంగం ఐక్యమై ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దొడ్డ కేశవులు, వెంకన్న బాబు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి, మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES