-గుండారంలో ప్రకార్డులతో స్థానికుల నిరసన
-మండలంలో రోడ్లన్నీ గుంతలమయమైయ్యాయని అక్రోశం
-రాజకీయ లబ్దికోసం బలిచేస్తున్నారని అగ్రహం
నవతెలంగాణ – బెజ్జంకి
పేరుకే ప్రజాప్రతినిధులుగా చలామణవుతున్నారని..ఇచ్చిన హామీల అమల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పలువురు గుండారం గ్రామ స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని గుండారం.. కిష్టాపూర్ గ్రామాల మధ్య గుంతలమయమైన బీటీ రోడ్డుపై పలువురు స్థానికులు ప్లకార్ఠులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రోడ్డుకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసిందని.. ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే ఇరువురు తమ రాజకీయ లబ్దికోసం స్థానికులను బలిచేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో రోడ్లన్నీ గుంతలమయమై రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అక్రోశం వెల్లగక్కారు. ఎన్నికల సమయంలో మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారించేల కృషి చేస్తానని హామీనిచ్చి ..ఎన్నికయ్యాక హామీలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విస్తరిస్తున్నారని..హామీల అమలు చేయనిపక్షంలో బేషరుతుగా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
పేరుకే ప్రజాప్రతినిధి..హామీల అమల్లో పక్షపాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



