Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన స్కోప్ సంస్థ ప్రతినిధులు

జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన స్కోప్ సంస్థ ప్రతినిధులు

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో బాల్య వివాహాలు నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డ్రాప్ అవుట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా స్కోప్ సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సోమ నరసయ్య అన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి తాము చేసిన కార్యక్రమాలపై వినతి పత్రంరూపంలో డిఈఓకు అందజేశారు.

ఈ సందర్భంగా డీఈవో సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కోప్ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించినట్లు సంస్థ ప్రతినిధులు చౌటుప్పల్ మండల కోఆర్డినేటర్ బాతరాజు నరసింహారాజు విలేకరులకు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదేవిధంగా స్కోప్ సంస్థ ప్రతినిధులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించాలని డీఈవో కోరినట్లు నరసింహ రాజు తెలిపారు. తమ కార్యక్రమాలపై డీఈవో సత్యనారాయణ అభినందించడం పట్ల సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల కోఆర్డినేటర్ బాతరాజు, నరసింహరాజు, సంస్థ ప్రతినిధులు కే.యాదయ్య, అశ్విని పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img