Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లెప్రసీ సర్వే చేయలేమంటూ వినతి 

లెప్రసీ సర్వే చేయలేమంటూ వినతి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు డిసెంబర్ 18 నుండి లెప్రసీ సర్వే చేయలేమంటు గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారికి మండల ఆశా వర్కర్స్ మరియు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు లెప్రసీ సర్వే చేసిన డబ్బులు ఇవ్వనందును సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెండింగ్ లెప్రసీ డబ్బులు చెల్లించేంతవరకు ఆశా వర్కర్లు లెప్రసీ సర్వే చేయరని తెలిపారు.అదేవిధంగా గతంలో ఆశాలకు ఎలక్షన్ డ్యూటీకి కూడా డబ్బులు ఇవ్వలేదన్నారు.

ఆశా వర్కర్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయని,రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల ఫిక్స్ వేతనం పై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండ ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జంపాల వసంత,కోయ మంజుల,పగడాల బాలమణి,పందుల పద్మ,రామావత్ లక్ష్మి,మెండు విజయ,బోయపల్లి విజయ,జిల్లా విజయ,వీరమల్ల ముత్యాలు,తదితరులు,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -