Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలుపలివెల మాజీ సర్పంచ్, కార్యదర్శిల‌పై చర్యలు తీసుకోవాలని డీపీఓకు వినతి

పలివెల మాజీ సర్పంచ్, కార్యదర్శిల‌పై చర్యలు తీసుకోవాలని డీపీఓకు వినతి

- Advertisement -

నవతెలంగాణ-మునుగోడు: మునుగోడు మండలంలోని పలువుల గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మానసపై చర్యలు తీసుకోవాలని పలివెల నూతన పాలకవర్గం, గ్రామస్తులు సోమవారం డిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. ఉప సర్పంచ్ చెరుకు సునీత సైదులు, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అభివృద్ధికి మంజూరైన రెండు కోట్లకు పైగా మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణ చేశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం కు పాల్పడిన మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మానసపై విచారణ జరిపి చట్టపర పైన చర్యలు తీసుకోవాలని కోరారు. దుర్వినియోగం అయినా నిధులను రికవరీ చేయాలని కోరారు.

గ్రామంలో నకిలీ బిల్లులతో ఇంటి పన్ను, నల్ల బిల్లులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని వేడుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాజీ సర్పంచ్, కార్యదర్శి పై చర్యలు తీసుకోపోతే పలివెల గ్రామ ప్రజలతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు మెంబర్లు బత్తుల వెంకన్న, ఆనగంటి కృష్ణ, బత్తుల ప్రవీణ్, గోసు కొండ మల్లేష్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసరాజు యాదగిరి, ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు సొల్లేటి నరసింహ చారి, కొండూరి మల్లికార్జున్, వరికుప్పల శంకర్, చెరుపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -