- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతారం ఎక్స్ రోడ్ నుంచి బొమ్మలరామారం వెళ్లే మార్గంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అనంతారం ఎక్స్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్లు చిందం మల్లికార్జున్, హరిబాబు, మాజీ ఉప సర్పంచ్ చిగురుమల్లి పోచయ్యలు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బల మీనా రెడ్డి పల్లెపాటి కొండలు మధిర వినోద్ కొంగల వెంకటేష్ పల్లెపాటి నరసింహ బొట్టు శేఖర్ ఎడ్ల నాగరాజ్ పల్లెపాటి సురేందర్ లు పాల్గొన్నారు.
- Advertisement -