నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగర్ గావ్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ మాజీ సర్పంచ్ కపిల్ పటేల్తో పాటు గ్రామస్తులు బుధవారం నుండి ఎంపీడీవో కార్యాలయానికి తరలి వచ్చి సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ , గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలు పరిశుభ్రత పాటించడం లేదని , గ్రామ వీధుల శుభ్రత చేయడం లేదని , వీధిలైట్లు లేక వీధులలో చిమ్మ చీకటీ గా ఉందని, రాత్రిపూట బయటకు వెళ్లాలంటే విష పురుగులతో భయంగా జీవనం కొనసాగిస్తున్నామని , గ్రామ పరిసరాలతో పరిశుభ్రత పాటించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నామని తెలిపారు.
గ్రామంలో అడుగుపెట్టాలంటే భయంగా ఉంటున్నామని , గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ఎంపిడిఓ కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు వారు వినతి పత్రంలో పేర్కొన్నారు . ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు దుర్బ్యంగా మారిందని , గ్రామ సమస్యలను ఎంపీడీవోకు గ్రామస్తులు వివరించారు . వినతిపత్రం అందించిన వారిలో మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ , పాంచాల్ శ్రీధర్ , సూర్యవంశీ యాదు , సాయిలు , అజిత్ , మారుతి తదితరులు పాల్గొన్నారు .
నాగల్ గావ్ గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES