- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : గత ఐదు నెలలుగా తమకురావలసిన కమిషన్ డబ్బులు ప్రభుత్వంవెంటనే విడుదల చేయాలని కోరుతు మండల రేషన్ డీలర్లు సోమవారం తహశీల్దార్ శ్రీలత కు వినతి పత్రం అందజేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కమిషన్ డబ్బులను వేర్వేరు కాకుండా పాత పద్ధతి లో ఒకేసారి విడుదల చేయాలని వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు లోలం భూమన్న ,అశోక్,భోజారాం, గంగారెడ్డి ,హైమద్, సర్దార్ ఖాన్, నిజాముద్దీన్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -