– క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని కేసీఆర్ రెండు పడక గదుల కాలనీ ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి విన్నవించారు. చాలా కాలంగా మిషన్ భగీరత నీళ్లు రావటం లేదని, వచ్చిన 10నిమిషాలు కుడా సరిగ్గా రాక నీళ్లు ఎవరికీ సరిపోవటం లేదని, దూరం నుండి నీళ్లు మోసుకు రావాల్సిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎస్ఈ రాజేందర్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా రెండు పడక గదుల కాలనీ నుండి గ్రామానికి వచ్చే దారిలో కరెంట్ పోల్స్ లేక చీకటిగా ఉంటుందని, ఊర్లోకి రావాలంటే ఇబ్బందిగా ఉందని తెలపడంతో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి వెంటనే విద్యుత్ స్తంభాలు, లైట్స్ త్వరగా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.
సమస్యలను పరిష్కరించాలని వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES