- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములో చేపల మార్కెట్ ఏర్పాటుకు స్థలం చూపాలని కోరుతూ మండల కేంద్రములోని గంగపుత్ర సంఘం సభ్యులు శుక్రవారం గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ కు వినతి పత్రము అందించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ చేపల విక్రయానికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ద్వారా మార్కెట్ ఏర్పాటుకు నిధులు మంజూరు కానున్నాయని, మార్కెట్ ఏర్పాటుకు సుమారు 5 వందల గజాల స్థలము అవసరము ఉంటుంది. కావున మండల కేంద్రములోని చేపల విక్రయానికి అనువైన స్థలాన్ని చూపించాలని సర్పంచ్ కు అందించిన వినతి పత్రం ద్వారా కోరినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమములో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



