Wednesday, July 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వలని కలెక్టర్ కు వినతి..   

లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వలని కలెక్టర్ కు వినతి..   

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ : ముధోల్ మండలంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లను ఇవ్వాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, యువ నాయకులు రావుల శ్రీనివాస్ లు బుధవారం రోజు నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ కలిసి వినతి పత్రం అందజేశారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్  పటేల్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిశారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాలకు ఇండ్లు మంజూరు చేయాలని వారు కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో భైంసా ఆత్మ కమిటీ చైర్మన్ వివేకానంద , సాయబ్ రావ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -