Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గోదావరి ఉధృతిలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన రెస్క్యూ టీం 

గోదావరి ఉధృతిలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన రెస్క్యూ టీం 

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
బాసర గోదావరి ఉధృతిలో రైల్వే స్టేషన్ ట్రాక్ సమీపంలో ఉన్న శివారులో ఓ అధికారి వ్వవసాయ క్షేత్రంలో  చిక్కుకున్న వ్యవసాయ కార్మికులు ఇద్దరిని రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన దళం(ఎస్ డిఆర్ ఎఫ్) బృందాలు శుక్రవారం సాయంత్రం కాపాడారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కార్మికులు సువర్ణ రాజు, బుచ్చయ్యలు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. ప్రతిరోజు వెళ్లినట్లే పనికి వెళ్లారు. అయితే గోదావరి ఉధృతి భారీగా పెరగడంతో వెంటనే తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ‌.ఈ సమాచారం బాసర తాసిల్దార్ పవన్ చంద్ర , బాసర ఎస్సై శ్రీనివాసులకు సమాచారం అందింది.

దీంతో ఎస్ డి ఆర్ఎఫ్  బృందాలు లకు సమాచారం అందించారు.వారు వేంటనే ప్రత్యేక బోట్ ద్వారా వేళ్ళిరెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్  సీఐ మల్లేష్, తహశీల్దార్ పవన్ చంద్ర దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న కార్మికుల దగ్గర కు చేరుకోని  లైఫ్ జాకెట్ లను ఎస్ డిఆర్ఎఫ్ బృందం సభ్యులుఅందించారు‌.కార్మికులతో పాటు వారు పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలను కూడా బోట్లో  కూర్చోబెట్టుకొని  సురక్షిత ప్రాంతాంమైన రైల్వే ట్రాక్ వరకు చేర్చారు. దీంతో  బాధితులు  పోలీసులకు, రెవెన్యూ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు‌ . ఈ సందర్భంగా కార్మికులను కాపాడిన ఎస్డిఆర్ఎఫ్ బృందం సభ్యులను అడిషనల్ ఎస్పి అభినందించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad