Wednesday, July 2, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీంలో రిజర్వేషన్లు అమలు

సుప్రీంలో రిజర్వేషన్లు అమలు

- Advertisement -

– సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం
– జూన్‌ 23 నుంచి పరిగణనలోకి
– సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి : సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయనుంది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియా మకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటి సారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. దాంతో సుప్రీంకోర్టులో నాన్‌-జ్యుడీషియల్‌ పోస్టు లకు ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వే షన్ల ప్రయోజనాన్ని పొందనున్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్‌ విధానం 2025 జూన్‌ 23 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఇది భారత సుప్రీం కోర్టులో పరిపాలనా పనితీరులో భారీ మార్పునకు సంకేతంగా నిలుస్తుంది.

సుప్రీంకోర్టులో రిజర్వేషన్‌ కింద మూడు కేటగిరిలు ఉంటాయి. అవి ఎస్సీ, ఎస్టీ, నాన్‌ రిజర్వ్‌డ్‌. రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్‌ విధానం వర్తిస్తే.. సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహా యింపుగా ఉండాలి? అని ప్రశ్నించారు. మన విలువలు, మన చర్యలకు అద్దం పట్టాలన్నారు. జూన్‌ 24న జారీ చేసిన సర్క్యులర్‌, మోడల్‌ రోస్టర్‌ ప్రకారం ఉన్నత న్యాయస్థాన ఉద్యోగులకు పదోన్నతుల్లో షెడ్యూల్డ్‌ కుల (ఎస్‌సీ) ఉద్యోగులకు సుప్రీంకోర్టులో 15 శాతం రిజర్వేషన్లు అమలవు తాయి.

షెడ్యూల్డ్‌ తెగ (ఎస్‌టీ) వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్లు అమలవు తాయి. రోస్టర్‌ లేదంటే రిజిస్టర్‌లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తి నట్లయితే వాటి గురించి రిజి స్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌)కు తెలియజేయవచ్చని సర్క్యులర్‌ పేర్కొంది. అయి తే, ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించదు. రిజిస్ట్రార్‌, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌, ఛాంబర్‌ అటెండెంట్‌ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -