సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నవతెలంగాణ- పెద్దవూర
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆఫీస్ సబార్దినేట్ ఐతగోని వెంకటయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి మంగళవారం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజీనామా లెటర్‌ను స్థానిక ప్రాథమిక వ్యవసాయ కార్యాలయంలో అందజేశారు. అతని రాజీనామాను పెద్దవూర పీఏసీఎస్ సంఘ కార్యవర్గం ఆమోదించిందని,జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ 29 నుంచి ఐతగోని వెంకటయ్యను విధుల నుంచి తొలగించినట్టు పీఏసీఎస్ చైర్మెన్ గుంటుక వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ.. అందుబాటులో ఉండి గ్రామంలో సమస్యలను నిజాయితీగా, బాధ్యతగా పరిష్కరిస్తామన్నారు. ఈనెల 14న జరుగనున్న ఎన్నికలో ఓటు ద్వారా తనను ఆశీర్వదించాలని కోరారు.



