- Advertisement -
సర్పంచిగా నామినేషన్ వేసిన ఐత గోని వెంకటయ్య
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆఫీస్ సభార్దినేట్ గా ఉద్యోగం చేస్తున్న మండల కేంద్రానికి చెందిన ఐతగోని వెంకటయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంగళవారం కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా నామీనేషన్ వేశారు. అట్టి రాజీనామాను పెద్దవూర పీఏసీఎస్ సంఘ కార్యవర్గం ఆమోదించనైనదని,కావున నవంబర్ 29 నుండి ఐతగోని వెంకటయ్యను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విధుల నుండి తీసేయడం జరిగిందని పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన రాజి నామ లెటర్ స్థానిక ప్రాథమిక వ్యవసాయ కార్యా లయంలో అందజేశారు.
- Advertisement -



