Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమోషనల్‌గా రాజీనామా చేశారు..పునరాలోచన చేయండి: మండ‌లి ఛైర్మ‌న్

ఎమోషనల్‌గా రాజీనామా చేశారు..పునరాలోచన చేయండి: మండ‌లి ఛైర్మ‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్టీకి వ్య‌తిరేకంగా అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె పార్టీ స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్సీ ప‌ద‌వీకి రాజీనామా చేస్తూ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.ఈ త‌ర్వాత‌ ఎమ్మెల్సీ రాజీనామాను శాస‌న‌మండలి ఛైర్మ‌న్‌కు పంపించారు. తాజాగా ఆమె రాజీనామాపై మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు. తన రాజీనామాను ఆమోదించమని ఎమ్మెల్సీ కే.కవిత కోరారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమోషనల్‌గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని గుత్తా అన్నారు.

నల్లగొండ జిల్లాలో చిట్ చాట్ సందర్భంగా కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ స్పందించారు. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చే డబ్బులు ప్రభుత్వ ఆస్పత్రులకు ఇచ్చి అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తే.. ప్రైవేట్ సంస్థల బెదిరింపులు తగ్గుతాయి. కుల, మతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీల మనుగడ కొనసాగదు’ అని స్పష్టం చేశారు.

చిట్ చాట్ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు విషయాలపై మాట్లాడారు. ‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పూర్తి అయ్యే లోపు డిండి నుంచి వృథాగా సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవాలి. యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వ వైఫల్యం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -