మంత్రి పొంగులేటికి స్పీకర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల సమస్యను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశించారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు ఇందిరమ్మ ఇండ్ల సమస్య గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులతో సమావేశం పెట్టాలని కోరారు. తన నియోజకవర్గం వికారాబాద్‌లోనూ డబుల్ బెడ్రూం ఇండ్లు 90 శాతం పనులు పూర్తయ్యాయనీ, మిగిలిన 10 శాతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, జయధీర్‌రెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, దానం నాగేందర్, రాకేశ్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ హామీ ఇచ్చామని అన్నారు. నియోజకవర్గాల వారీగా మరికొన్ని ఇండ్లను మంజూరు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల సమస్యను పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



