Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యలు వెంటనే పరిష్కరించండి

సమస్యలు వెంటనే పరిష్కరించండి

- Advertisement -

ముఖ్యమంత్రికి టీజీడీఏ వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజీడీఏ) కోరింది. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని అసోసియేషన్‌ అధ్యక్షలు డాక్టర్‌ బి.నరహరి, కోశాధికారి మహ్మద్‌ ఖాజా రవూఫుద్దీన్‌ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సర్వీస్‌ కండీషన్స్‌, పాలనలో స్పష్టత, జీతంలో స్థిరత్వం కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సైండరీ హెల్త్‌ సర్వీసెస్‌గా మార్చాలని వారు కోరారు.

డీపీహెచ్‌ డాక్టర్లకు డీఎంహెచ్‌ఓల్లో సీనియార్టీని పరిరక్షంచేలా జీవో నెంబర్‌ 142ను సవరించాలనీ, గ్రామీణ, గిరిజిన మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బందికి స్పెషల్‌ అలవెన్స్‌ ఇవ్వాలనీ, డీహెచ్‌ పరిధిలో డాక్టర్లకు నిర్దిష్ట కాలంలో పదోన్నతులు కల్పించాలనీ, నిమ్స్‌తో సమాంతరంగా ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పాలనా, విద్యాపరంగా ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా ప్రొఫెసర్లను ఖాళీ పోస్టులకు బదిలీ చేయాలని కోరారు. గుర్తింపు ఉన్న ఏకైక సంఘంగా తమ అసోసియేషన్‌ ను జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో చేర్చాలనీ, అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్లకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని అభ్యర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -