Wednesday, November 19, 2025
E-PAPER
Homeసినిమారెస్పాన్స్‌ అదుర్స్‌..

రెస్పాన్స్‌ అదుర్స్‌..

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బాక్సాఫీస్‌ సక్సెస్‌ అందుకున్న నేపథ్యంలో మేకర్స్‌ ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘ఏడాదిన్నర పాటు ఈ సినిమాకు పడిన కష్టం మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు’ అని అన్నారు.
‘మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నాం. ప్రతి ప్రొడక్ట్‌కు పాజిటివ్‌, నెగిటివ్‌ రివ్యూస్‌ ఉంటాయి. మేము పాజిటివ్‌ను తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా మూవీ వచ్చే ఆదివారం వరకు రూ. 6.5 కోట్ల వరకు కలెక్ట్‌ చేస్తుందని ఆశిస్తున్నాం. మాలాంటి చిన్న చిత్రానికి ఇది పెద్ద బాక్సాఫీస్‌ నెంబర్‌ అనుకోవచ్చు’ అని ప్రొడ్యూసర్‌ మధుర శ్రీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రొడ్యూసర్‌ నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ,’మా సినిమాకు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. శ్రీధర్‌తో కలిసి మేము చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం దక్కింది. విక్రాంత్‌, చాందినీ నటన అందరినీ ఆకట్టుకుంది. డైరెక్టర్‌ సంజీవ్‌ సకుటుంబంగా చూసేలా సినిమాను రూపొందించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సందేశాన్ని మా సినిమా ద్వారా చెప్పాం’ అని తెలిపారు. ‘మా సినిమాను మీరంతా ఇష్టపడతారని అనుకున్నాము. గానీ ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదు. మేం ఊహించినదానికంటే ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు’ అని నాయకానాయికలు విక్రాంత్‌, చాందినీచౌదరి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -