Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలునవతెలంగాణ వెబ్ కథనానికి స్పందన

నవతెలంగాణ వెబ్ కథనానికి స్పందన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పచ్చిరొట్టె భూసారం పెంచడంలో దిట్టని మండల వ్యవసాయాధికారి బొల్లపెళ్లి శ్రీజ బుధవారం అన్నారు. బుధవారం నవ తెలంగాణ వెబ్ పత్రికలో ప్రచురించిన ,,విత్తనాల కోసం ఎదురుచూపులు,, అనే కథనానికి మండల వ్యవసాయాధికారి శ్రీజ స్పందించారు. మండలంలో సబ్సిడీపై అందుబాటులో 50 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు ఉన్నాయన్నారు.రాబోవు వానాకాలం 2025 సీజన్ కు గాను రాయితీ పై జీలుగ విత్తనాలు 50 క్వింటాళ్ళు మండలంలోని  ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం కొయ్యూరు నందు  విత్తనాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు.ఇట్టి పచ్చి రొట్ట జీలుగా విత్తనాలు కిలోకు మొత్తం ధర రూ.142.50, ప్రభుత్వ రాయితీపై రూ.71.25, రైతువాట రూ. 71.25 ఉంటుందన్నారు.ఎకరానికి 12 కిలోల చొప్పున ఒక బస్తా(30కిలోలు) రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు.వరి పంట మిరప పంట వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తోలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకొన్నచో భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఇట్టి జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ ప్రతితో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించగలరని పేర్కొన్నారు. ఒక బస్తా (30కిలోల) జీలుగ విత్తనాలు రూ 2137.50 ఉంటుందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad