- Advertisement -
నవతెలంగాణ -పరకాల
వ్యవసాయ శాఖ చేసే తనీఖీలన్నీ ఫ్రెండ్లీ తనిఖీలే కథనానికి స్పందన లభించింది. ఎట్టకేలకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయివేట్ ఫర్టిలైజర్స్ నుండి యూరియా పంపిణి జరుపనున్నట్లు పరకాల వ్వవశాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఆదివారం పరకాల పట్టణంలోని క్రాంతి ట్రేడర్, రాఘవేంద్ర ఎరువుల దుకాణం,సీతారామ పర్టిలైజర్స్,వారాహి ఎరువుల ట్రేడర్స్ ద్వారా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఆదివారం ఉదయం 7గంటల నుండి ఆధార్ కార్డు తీసుకువచ్చి ఎరువులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -