తొలగిన రోడ్డుపైన అడ్డంకులు..
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం నుండి ఉప్లూర్ వెళ్లేదారిలో గత ఆదివారం మధ్యాహ్నం బీటీ రోడ్డుపై అడ్డంగా నేలకూలిన భారీ వృక్షాన్ని మంగళవారం తొలగించారు. నవతెలంగాణలో వచ్చిన ‘రోడ్డుపై అడ్డంగా వృక్షం… పట్టించుకునే నాథుడే లేడు’ కథనానికి స్పందించిన ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్ బీటీ రోడ్డుపై అడ్డంగా పడ్డ చెట్టును తొలగింపజేశారు. బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో నేల కూలిన భారీ వృక్షాన్ని రోడ్డు పక్కకు జరిపించారు. ఈ పనులను పంచాయతీ కార్యదర్శి నరేందర్ స్వయంగా దగ్గరుండి మరి చెట్టును రోడ్డు మీద నుండి తీయించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు భూమి బాగా నాని ఉప్లూర్ వెళ్లే దారిలో దమ్మన్నపేట శివారులో ఓ భారీ వృక్షం వేర్లతో సహా బీటీ రోడ్డుపై పడిపోయింది. రెండు రోజులు గడిచిన ఈ చెట్టును తొలగించేందుకు ఎవరు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాహనదారుల, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నవతెలంగాణ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి చెట్టును పక్కకు తీయించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, రోడ్డుపై అడ్డంగా పడ్డ భారీ వృక్షాన్ని తొలగించి రోడ్డును క్లియర్ చేయడంలో కృషి చేసిన నవ తెలంగాణకు పలువురు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
నవతెలంగాణ కథనానికి స్పందన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES