– పాఠశాలను సందర్శించిన మండల స్థాయి అధికారులు..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బిజ్జల్ వాడి గ్రామంలోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, మండల విద్యాధికారి తిరుపతయ్య బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవ తెలంగాణ పత్రికలో ” పెచ్చులుడూతున్న పాఠశాల భవనము” అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారని అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రావడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా నవ తెలంగాణ పత్రికతో మండల పరిషత్ అధికారి, ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పాఠశాల భవనం స్థితిగతులు ఎలా ఉన్నాయో సందర్శించి నివేదికలు పంపించాలని జిల్లా అధికారి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అందులో భాగంగా బుధవారం నాడు పాఠశాల భవనం పరిశీలనకు రావడం జరిగిందని అన్నారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైందని, పాత భవనాన్ని కూల్చేసి నూతన భవనం నిర్మాణం చేయాలని కోరుతూ పాత భవనానికి సంబంధించిన నివేదికలు తయారుచేసి జిల్లా విద్యాధికారికి త్వరలో పంపిస్తామని తెలిపారు. భవనం సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా పాలనాధికారికి పంపించడం జరుగుతుందని అన్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES