వెంటనే పారిశుధ్య పనులు చేయించేందుకు ఎంపీడీఓ ఆదేశాలు
నవతెలంగాణ – నవాబ్ పేట
మండల పరిధిలోని చౌడూరు గ్రామంలో పలు వీధులలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని రోడ్డుపైనే డ్రైనేజీ పారుతుందని గ్రామస్తులు మీడియాకు సమాచారం చేరవేయడంతో నవతెలంగాణ పత్రికలో వచ్చిన వార్తకు ఎంపీడీవో వెంటనే స్పందించి పంచాయతీ కార్యదర్శికి పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలోని మురికి కాలువలు డ్రైనేజీలను చెత్త కుప్పలను పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కోసం చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎప్పటికప్పుడు ప్రజల సౌకర్యార్థం మౌలిక సధుపాయాల కల్పనకు ఎప్పటికప్పుడు గ్రామంలో పర్యవేక్షణ ఉండాలని ప్రజల ఆరోగ్యం పై వెనుకడుగు వేయొద్దని సూచించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు
నవతెలంగాణ వార్తకు స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES