Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ వార్తకు స్పందన

నవతెలంగాణ వార్తకు స్పందన

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని పెద్ద గోపులారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందిపై నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన తాగునీటి వసతి లేక ఇబ్బందుల్లో విద్యార్థులు శీర్షికకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పందించారు. గోపులారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి కటకట పై విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యంపై క్షేత్రస్థాయిలో పాఠశాలను సందర్శించి నివేదిక సమర్పించాలని మండల విద్యాధికారి భీంసింగ్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా మండలంలోని ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ పథకం కింద నీటి కనెక్షన్ ను ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల తొట్టి వద్ద విద్యార్థులు నీరు తాగితే విద్యార్థులు అస్వస్థకు గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -